AP: రాష్ట్రంలో మద్యం విధానం, బీరు సరఫరాపై కేబినెట్ సబ్‌కమిటీ కీలక సమీక్ష నిర్వహించింది. లైసెన్స్ ఫీజు సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత అంశాలను కమిటీ సభ్యులకు అధికారులు వివరించారు. బీరు సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలపై కూడా ఈ సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది.