TG: కృష్ణా నదిపై కర్ణాటక ప్రతిపాదిస్తున్న కొత్త ఆనకట్ట విషయమై ఇరు రాష్ట్రాల మధ్య కీలక చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై కర్ణాటక అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండానే ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ అభిప్రాయాలను కర్ణాటక బృందానికి వివరించారు.