ASR: ప్రభుత్వం 90శాతం రాయితీపై అందిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వైవీ రమణారావు, చింతపల్లి ఏడీఏ బీవీ తిరుమలరావు, ఏవో టీ.మధుసూధనరావు రైతులకు సూచించారు. సోమవారం కొమ్మంగి రైతు సేవా కేంద్రంలో పలువురు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. పచ్చిరొట్ట విత్తనాల వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.