ASR: డుంబ్రిగూడ మండలం కితలగి పంచాయతీ పాములపుట్టు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ గాలుల ధాటికి ఎంపీపీ పాఠశాల భవనం పైరేకులు పూర్తిగా ఎగిరిపోవడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. జూన్ 12 పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు భవనానికి కొత్త పైరేకులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.