KMM: స్త్రీ శక్తి భవనాలను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో 8వేల భవనాలకు శంకుస్థాపన చేశారు. సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో రెండు భవనాలకు సర్పంచ్ హీరాలాల్, ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్ శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అని తెలిపారు.