RR: తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఛైర్మన్గా రఘునాథ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, యాదవ సామాజిక వర్గ సంక్షేమంపై చర్చించారు. సీఎం సూచనల ప్రకారం యాదవ సోదరుల సమగ్ర అభ్యున్నతికి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు అంకితభావంతో పనిచేస్తానని రఘునాథ్ యాదవ్ స్పష్టం చేశారు.