NTR: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీఐ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాచవరం ఎస్సై శంకర్ పాల్గొని విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వివరించారు. పొగాకు, గుట్కా, సిగరెట్లు వంటి మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని, ముఖ్యంగా యువత వీటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.