W.G: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవసరమైన చోట జనాభా ప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా వార్డు వార్డుకు మంచినీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు.