AP: జనసేనలోనూ అనేక అంశాల్ని లీకు చేసేవారున్నారని పవన్ విమర్శించారు. జనసేన ఇకపై కట్టుదిట్టంగా ఉంటుందని, పార్టీలో ఉండగలిగే వారు ఉండాలని, లేకుంటే వెళ్లిపోవాలని సూచించారు. జనసేన నాయకులు బలపడాల్సింది పోయి చప్పబడిపోయారని, పదవులు రాగానే చాలా మంది మెత్తబడిపోయారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటి నాయకులు పార్టీకి అవసరం లేదని, తాము ఎదగడానికి తనను వాడుకుంటానంటే సహించనని పవన్ హెచ్చరించారు.