ఐఐటీ రూర్కీ.. JEE Advanced-2026 ప్రాథమిక కీ విడుదల చేసింది. కీపై అభ్యంతరాలుంటే రేపటి వరకు అవకాశం ఇచ్చింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 17న రెండు షిఫ్టుల్లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశ వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఫైనల్ కీతో పాటు ఫలితాలను జూన్1 విడుదల అవుతాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.