అన్నమయ్య: సమస్యల పరిష్కార వేదిక అర్జీలను ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించగా మొత్తం 393 అర్జీలు అందాయి.