NLR: జిల్లాలో ప్రారంభమైన రెగ్యులర్ టెన్త్, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిప్యూటీ డీఈవో జానకిరామ్ తెలిపారు. రెగ్యులర్ పదో తరగతి పరీక్షలకు 1,506 మంది, ఓపెన్ టెన్త్ 783 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 377 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.