ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్లో “పిల్లల రక్షణ సమాజం బాధ్యత” అనే అవగాహన పోస్టర్లను కలెక్టర్ హరిత ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. పిల్లల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. బాలలపై జరిగే వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల భద్రత, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.