PPM: జిల్లా మండల కేంద్రంలోని నర్సిపురంలో ఏర్పాటుకానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కలసి సోమవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 30 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని తెలిపారు.