కోనసీమ: టీడీపీ క్లస్టర్ మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడుకు సంబంధించిన పోస్టర్ను రావులపాలెం క్యాంపు కార్యాలయంలో యువ నాయకులు బండారు సంజీవతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.