విజయనగరం కంటోన్మెంట్ పురపాలక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, విధ్యుత్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు పరీక్షల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.