ATP: మంత్రి పయ్యావుల కేశవ్పై ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి విమర్శలు చేశారు. పయ్యావుల కుటుంబానికి దొంగ సారా, కల్తీ కల్లు విక్రయించిన చరిత్ర ఉందని ఆరోపించారు. నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ హత్యా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. గతంలో పయ్యావుల కుటుంబం చేసిన దుర్మార్గాలపై కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేశాయని గుర్తు చేశారు.