ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడిగా నియమితులైన డోన్‌కు చెందిన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును కలిశారు. ఎమ్మెల్యే నివాసంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.