AP: దేశ ప్రజలను దోచుకోవడంలో ప్రధాని మోదీని మించినోళ్లు లేరని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. 10 రోజుల్లో వరుసగా నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అత్యంత దారుణమన్నారు. రోజుకు రూ.వెయ్యి కోట్ల అదనపు భారం మోపుతున్నా.. మోదీకి ఆకలి తీరడం లేదన్నారు. సామాన్యుల సంపాదన కాజేసి, పేదలను రోడ్డున పడేసి, దేశ ప్రజల బతుకు భారం చేసే కుట్ర అని విమర్శించారు.