సినిమా టికెట్ ధరలను పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని తమిళ హీరో విజయ్ సేతుపతి సీఎం విజయ్ను కోరాడు. కమల్ హాసన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంటే సినీ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందన్నాడు. మొదట్లో వేగంగా పుంజుకున్న ఓటీటీలు ప్రస్తుతం చతికిలపడటంతో సినిమా వృత్తి గందరగోళంలో పడిందని అన్నాడు.