W.G: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవల కాలంలో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 118.06, డీజిల్ రూ.105.69 విక్రయిస్తున్నారు. దఫదఫాలుగా తమపై మోయలేని భారం వేస్తున్నారంటూ స్థానికులు సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరిగిన కొత్త రేట్లు సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి.