NTR: తెన్నేరు ఇటుక బట్టీల వద్ద కైకలూరుకు చెందిన జొన్నాదుల మేరి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వినోద్ అనే వ్యక్తితో కలిసి ఆమె ఇక్కడ పనికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం నేపథ్యంలో, విభేదాలు రావడంతోనే ఆమెను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.