కోనసీమ: రాజోలు మండలం పొన్నమండలో ఈ నెల 11న MPP శ్రీదుర్గ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. యూపీకి చెందిన నిందితులు నయీమ్ త్యాగి, ఎండీ సుల్తాన్ త్యాగిని అరెస్టు చేసినట్లు రాజోలు సీఐ సురేశ్ బాబు ఆదివారం తెలిపారు. వారి నుంచి 4 గ్రాముల బంగారం, రూ.1.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేవలం 10 రోజుల్లోనే కేసును ఛేదించినట్లు పేర్కొన్నారు.