SS: ధర్మవరం నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై YCP ఆధ్వర్యంలో బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల మ్యాపింగ్, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణ, కొత్త ఓటర్ల చేర్పులు, అనర్హుల తొలగింపులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమగ్రంగా అవగాహన కల్పించారు.