MDCL: MMTS సర్వీసులు తగ్గడం, సమయపాలన లోపించడం వల్ల నగర ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. కాచిగూడ-రాయచూర్, ఫలక్నుమా-వాడి, గుంతకల్లు-బోధన్ ప్యాసింజర్తో పాటు మెమూ, డెమూ రైళ్లు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నాయి. మేడ్చల్, ఘట్కేసర్, లింగంపల్లి మార్గాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.