SRPT: సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని, వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు, మజ్జిగ ఎక్కువగా తాగాలని పేర్కొన్నారు.