AP: NTR జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. వడదెబ్బతో కేతనకొండలో ఒకరు, కొటికలపూడిలో మరో వ్యక్తి మరణించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఎండల తీవ్రత రోజురోజుకు పెరగడంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు.