PLD: వినుకొండ పట్టణంలోని లాయర్ స్ట్రీట్లో నిర్వహించిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. కార్యాలయం నుంచి ఎలక్ట్రానిక్ స్కూటీపై స్వయంగా కార్యక్రమ ప్రాంతానికి చేరుకున్న ఆయన.. చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు.