మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో ఓ వ్యక్తి బాత్రూంలో జారిపడి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. YSR రోడ్డులో నివాసం ఉండే నరసింహారెడ్డి బాత్రూంలో స్నానం చేసేందుకు వెళ్లి జారిపడ్డారు. తలకు బలమైన గాయం పడడంతో నరసింహారెడ్డి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.