నీట్ యూజీ-2026 పరీక్ష ఫీజు రీఫండ్ కోసం NTA దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://neet.nta.nic.in/ ను సందర్శించి రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించేందుకు మే 27ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో రీఫండ్ లింక్‌పై క్లిక్ చేసి బ్యాంక్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.