KNR: శంకరపట్నం మండలం కరీంపేట సబ్ సెంటర్ను శుక్రవారం హుజరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రావణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్సీడీ సర్వేకు సంబంధించిన రికార్డులు, ఫీల్డ్ రిపోర్టులను ఆయన పరిశీలించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఇంటింటా సర్వే వేగవంతం చేయాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించాలన్నారు.