ATP: అనంతపురం టీడీపీ కార్యాలయంలో 42వ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అర్జీలను వెంటనే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు పంపి, త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.