SS: టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి మహానాడు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. మే 27, 28 తేదీల్లో జరిగే ఈ వేడుకల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మడకశిర మండలం జక్కేపల్లిలో శనివారం స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.