NLG: గుడిపల్లి మండలం మాదాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను శనివారం ఎంపీడీవో అండాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం ఎండలో తీవ్రత ఎక్కువగా ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామావత్ శ్రీనునాయక్, టీఏ అంజి, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,తదితరులున్నారు.