ASF: సేంద్రియ సాగుపై రైతులు దృష్టిని సారించాలని శాస్త్రవేత్తలు సమీర్, సతీష్‌లు సూచించారు. శనివారం కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జంగంలో రైతులకు అవగాహన సదస్సును వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వ్యవసాయ సాగులో సస్యరక్షణ చర్యలు భూ సంరక్షణ చర్యలు తదితరాలపై రైతులకు అవగాహననూ కల్పించారు. పంట మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు.