SKLM: విద్యార్థులపై భారం తగ్గించేందుకు సాంఘిక శాస్త్ర సిలబస్ కుదించాలని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం కోరింది. డీఈవో ఎ.రవిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ పప్పల వేణుగోపాల్‌కు వినతిపత్రం అందించారు. ఇతర సబ్జెక్టులతో పోలిస్తే సాంఘిక శాస్త్రం విద్యార్థులకు భారంగా మారిందని, సిలబస్ తగ్గించలేకపోతే రెండు విభాగాలుగా చేసి ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.