BPT: అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరులో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. పుట్టా వారి పాలెం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ 62 లక్షల చెక్కులను140 మంది లబ్దిదారులకు మంత్రి గొట్టిపాటి అందజేశారు. పేదల సంక్షేమమే పరమావధిగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.