దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మరో వారం పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. ముఖ్యంగా UP, MP, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, AP, తెలంగాణ, యానాం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు తీవ్ర వడగాలుల ముప్పు ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.