పల్నాడు జిల్లాలో తీవ్ర ఎండలు, వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహ సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు తీసుకోవాలని సూచించారు.