ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి భారీ వడగాలులు వీస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు అన్నారు. తీవ్రమైన ఎండలు, వడగాలుల ప్రభావంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు సూచించారు.