VZM: స్వచ్చ రథానికి వ్యర్థాలు ఇచ్చి నిత్యావసర సరకులు తీసుకోవాలని బొబ్బిలి MLA బేబినాయన సూచించారు. శనివారం బాడంగి MPDO కార్యాలయంలో స్వచ్చ రథం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో స్వచ్చ రథం ప్లాస్టిక్, ఐరన్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ వ్యర్థాలను తీసుకుని నిత్యావసర సరకులు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.