BHPL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదు జిల్లాలకు కాంగ్రెస్ ఎస్సీ చైర్మన్లను నియమించినప్పటికీ భూపాలపల్లి జిల్లాకు మాత్రం నియామకం జరగకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇతర జిల్లాల్లో నియామకాలు పూర్తి కాగా భూపాలపల్లిని పక్కన పెట్టడానికి కారణమేంటనే అంశంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో చర్చలు సాగుతున్నట్లు సమాచారం.