PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ రైతు వేదికలో శనివారం రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఎలా గౌడ్ రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. భూసార పరీక్షల ప్రాధాన్యాన్ని, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను ఎంచుకోవాలని, పచ్చి రొట్ట ఎరువులను భూమిలో కలియదున్నాలన్నారు.