HYDలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై పోలీసులు నిఘా మరింత కట్టుదిట్టం చేయడంతో స్మగ్లర్లు కొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు. 2024లో రూ.130 కోట్లకు పైగా డ్రగ్స్ స్వాధీనం కాగా, 2025లో ఆ విలువ రూ.50 కోట్లకే పరిమితమైంది. అయితే కేసులు, అరెస్టులు మాత్రం పెరుగుతుండటం గమనార్హం. 2026లో ఇప్పటికే 98కి పైగా కేసులు నమోదు అయ్యాయి.