WNP: జనగణన-2027లో భాగంగా మే 11న ప్రారంభమైన ఇంటి గణన ప్రక్రియను వేగవంతం చేసి, జూన్ 9 నాటికి పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర జనగణన అధికారి భారతి హోలికేరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. వీసీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగణనను కచ్చితత్వం, సమన్వయంతో పూర్తి చేయాలన్నారు.