TG: సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించకున్నారు. రేవంత్‌తో పాటు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. కాసేపట్లో టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు.