నిజామాబాద్లో కరీంనగర్- బోధన్, బోధన్- కరీంనగర్ (67773), (67774) నడిచే రైలును ఈ నెల 23, 24, 25, 30, 31తేదీలతో పాటు జూన్ 1 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక 77649, 77650 కాచిగూడ–కరీంనగర్, కరీంనగర్–కాచిగూడ రైళ్లు ఈ నెల 24, 31 తేదీల్లో రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.