KDP: జిల్లాలో కురిసిన తొలకరి వర్షాలు ప్రజలకు ఎండల నుంచి ఊరటనిచ్చాయి. చెన్నూరులో అత్యధికంగా 43.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా, కాశినాయన, సీకేదిన్నె, ఖాజీపేట మండలాల్లోనూ మంచి వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు ఉపశమనం పొందారు. రైతులు కూడా ఈ వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.