ఎండల తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే 30 మంది మృతి చెందారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో 21 మంది మరణించారు. విజయవాడలో 10 మంది, ఏలూరు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. అటు తెలంగాణలోనూ నిన్న ఒక్కరోజే 9 మంది ఎండ దెబ్బతో మృతి చెందారు. ఈ ఏడాది ఎండలు గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.