BPT: బాపట్లలోని ప్రధాన రహదారుల వెంట మంచినీటి పైప్లైన్లు విచ్చలవిడిగా లీకవుతుండటంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే పైపులు పగిలి తాగునీరు వృథాగా రోడ్లపాలవుతున్నా.. కనీసం డమ్మీలు వేసి అరికట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లీకేజీలకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.